ఇంటర్నెట్ డెస్క్: దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ఇరాన్‌తో డీల్ పై ట్రంప్ ప్రకటన నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం తర్వాత ఈ లోహాల ధరల్లో ఒక్కసారిగా దిద్దుబాటు చోటుచేసుకుంది. దీంతో మధ్యాహ్నం 3 గంటల సమయంలో హైదరాబాద్ విపణిలో 10 గ్రాముల మేలిమి 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,46,730 పలికింది. ఈ ఉదయంతో పోలిస్తే దీని ధర దాదాపు రూ.2వేల పైన తగ్గింది. ఇక, కేజీ వెండి ధర రూ.2.28లక్షలకు చేరింది. క్రితం రోజుతో పోలిస్తే వెండి ధర దాదాపు రూ.6వేల మేర దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 4049 డాలర్లు పలికింది. ఈ ఉదయం దీని ధర దాదాపు 4200 డాలర్లు పలకగా ట్రంప్ ప్రకటన తర్వాత ఒక్కసారిగా పడిపోయింది. ఔన్సు వెండి ధర 58.40 డాలర్లుగా ట్రేడ్ అవుతోంది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీల్లోనూ ఈ లోహాల ధరలు పతనమయ్యాయి. గోల్డ్ ఆగస్టు ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ 10 గ్రాముల ధర 1.5శాతం పడిపోయి రూ.1.43లక్షల వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి సెప్టెంబరు ఫ్యూచర్స్ కేజీ ధర రూ.2.28లక్షలకు చేరింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. అమెరికా కోర్టులో ప్రమాణ పత్రం సమర్పించనున్న గౌతమ్ అదానీ! అంచనాలను మించిన టీసీఎస్! సెమాగ్లుటైడ్ సరఫరా తాత్కాలిక నిలిపివేత! బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ రూ.1.34లక్షలు! ఎలక్ట్రానిక్స్ తయారీలో వాడే కీలక విడిభాగాలపై కస్టమ్స్ సుంకం రద్దు! విపణిలోకి నిస్సాన్ టెక్టాన్! దలాల్ స్ట్రీట్‌లో ఇక కొత్త తరం కంపెనీలదే హవా! 2028 కల్లా 3,800 ఉద్యోగాలు: హోండా! చివరి గంటలో లాభాల స్వీకరణ! అత్యుత్తమ పని ప్రదేశంగా ఎస్ఈఐఎల్ ఎనర్జీ ఇండియా! ఇన్సులిన్..#gold_price #silver_price #international_market #trump_announcement #hyderabad_market